ఐఐటీ ల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, సమాజంలో ఎవరు ఆత్మహత్య చేసుకున్న అది కచ్చితంగా తప్పే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి విద్యా సంస్థల్లో కమిటీలు వేసినట్టు చెప్పారు. ఐఐటి హైదరాబాద్ లో నిర్వహింహిస్తున్న “ఆర్ అండ్ డి ఇన్నొవేటివ్ ఫైర్ ఇన్వెంటివ్” రెండవ ఎడిషన్‌ను ప్రాదాన్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యి కోట్లతో సమ్మక సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, దీనికి సంబంధించిన పనులు కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నాయని, 2014 లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇప్పుడు లక్షా 30 వెలకి పైగా పెరిగాయని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు భారత్ కేరాఫ్గామారిందని. ఈ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ , వికసిత్ భారత్ దృష్టిని సాకారం చేయడంలో విద్య యొక్క కీలక పాత్రను గుర్తించినట్టు మంత్రి చెప్పారు. “ఇన్వెంటివ్-2024” దేశంలోని అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థలు పాలుపంచుకోవడం హర్షించదగ్గ విషయం అని కేంద్ర మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో బిఓజి చైర్మన్, ఐఐటి హైదరాబాద్ డా. బి వి ఆర్ మోహన్ రెడ్డి, ఇన్వెంటివ్-2024 స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ ప్రొ. బి ఎస్ మూర్తి, విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సైయంట్ , హనీవెల్, అప్లైడ్ మెటీరియల్స్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, ఐసిఐసిఐ, సినర్జీ, సన్ ఫార్మా, సుజుకి మోటార్స్, బాష్, ష్నైడర్ ఎలక్ట్రిక్, ఎన్‌టిపిసితో సహా అగ్రశ్రేణి వాటాదారులు ఇన్వెంటివ్-2024 ఈవెంట్‌లో పాల్గొన్నాయి.