WARANGAL - EAGLE NEWS

WARANGAL

వరంగల్ జిల్లా చరిత్ర

ఒకప్పటి ఒరుగాల్లె ఇప్పటి వరంగల్.  ఈ జిల్లలో అనేక పురాతన చారిత్రిక ప్రదేశాలు , కట్టడాలు ఉన్నాయి.  దేశ ప్రధానిని అందించిన గొప్ప జిల్లా వరంగల్. కాకతీయుల పాలన, కళా వైభవాన్ని చాటి చెప్పే జిల్లా ఇది.  ప్రధానిగా సేవలందించిన తొలి తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ఈ జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణం. తొలుత ఈ జిల్లాలో 6 తాలూకాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉండేవి,  తరువాత 1979 సంవత్సరంలో  15 తాలూకాలు పెరిగాయి. 1985లో  మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు వరంగల్ జిల్లాను  50 మండలాలుగా  విభజించారు.

Warangal Kakathiya Keerthi Thoranam 1

విభజన తర్వాత..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన పునర్య్వస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్,  అనే 5 కొత్త జిల్లాలుగా విడిపోయింది.   

Warangal Veyishambala Gudi

ప్రజల డిమాండ్ మేరకు 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లాను 13 మండలాలతో వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను 14 మండలాలతో హన్మకొండ జిల్లాగా మార్చారు..