SRIKAKULAM - EAGLE NEWS

SRIKAKULAM

శ్రీకాకుళం జిల్లా చరిత్ర

“చిక్కోలు”…. ఆంధ్ర రాష్ట్రంలో చిత్రమైన పేరు. ఇదీ కూడా శ్రీకాకుళం పేరే.  నైజంల హయంలో రైతులు జమాబంది కింద పన్నులు చెల్లించే వారు. ఆ పన్నుల మూటలను విప్పదీయమని చెప్పడానికి నిజాం సేనలు “శిఖాఖోల్”  ఆనే వారు.. అదే క్రమంగా చికకోల్, చిక్కోల్ గా మారిందని చెబుతుంటారు. విశాఖపట్నం జిల్లా నుండి కొన్ని మండలాలను విభజించి శ్రీకాకుళం జిల్లాలను ఏర్పాటు చేశారు. అందుకే,  ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్రే దీనికి ఆధారం. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు అంటే  ఎనిమిది వందల సంవత్సరాలు పాలించారు.  1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది.  ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్  ఉద్యమం ఈ  జిల్లాలోనే ప్రారంభమయింది. ప్రస్తుతం జిల్లా జనాభా సుమారు 25 లక్షల వరకు ఉంటుంది.

విభజన తర్వాత…

జిల్లా లో మొత్తం 2 లోక్ సభ, 8 శాసన సభ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం (పాక్షికంగా) పార్లమెంట్, శ్రీకాకుళం, ఆముదాలవలస , విజయనగరం (పాక్షికంగా),ఇచ్చాపురం, టెక్కలి, ఎచెర్ల, నరసన్న పేట, పలాసలు అసెంబ్లీ నియోజక వర్గాలుగా ఉన్నాయి.జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండలను రెవిన్యూ డివిజన్లుగా మార్చారు..38 మండలాలు ఉండేవి.విభజనలో నలుగు మండలాలను పార్వతీపురం జిల్లాలో కలిపారు.