ANATHAPUR - EAGLE NEWS

ANATHAPUR

అనంతపురం జిల్లా చరిత్ర

దేశ రాష్ట్రపతిని అందించిన పట్టణం అనంతపురం. అశోకుడు పాలించిన ప్రాంతంగా చారిత్రిక ఆధారాలు  చెబుతున్నాయి.  క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది.  అశోకుడి తర్వాత నలలు 7 శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని  పాలించారు. గంగ రాజులు, చోళులు, చాలక్యులు హోయసలు, యాదవులు సైతం ఈ ప్రాంతాన్ని పాలించారు. 1258వ సంవత్సరం నుండి 16 వ  శతాబ్దం వరకు విజయనగరాధీశుల పాలనలో ఉంది. బుక్కరాయల పేరు మీదుగా ఈ ప్రాంతంలో ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయ సముద్రం అనే పట్టణం ఏర్పడింది.

atp F

ఈ ప్రాంతపు పట్టణానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశపు అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. 1677వ సంవత్సరంలో ఈ ప్రాంతం మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 సంవత్సరం లో అసఫ్ జాహి వంశస్థులు దీనిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 1799 సంవత్సరంలో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచుకున్నారు. తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. అనంతపురం జిల్లాలో మొత్తం 503 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. రాగి సంకటి, జొన్న రొట్టెలు ఇక్కడ ప్రసిద్ధి.

నియోజక వర్గాలు

అనతపురం జిల్లాలో 2 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనతపురం, హిందూపురం పార్లమెంట్, అనతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్, రాప్తాడ్, శింగనమల, రాయదుర్గంలు శాసనసభ నినయోజకవర్గాలుగా ఉన్నాయి.

atp darga F

ప్రముఖులు

మాజీ రాష్ట్రపతి, మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, తెలుగు సినీ దర్శకుడు కె.వి. రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి, ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ, మైక్రోసాఫ్ట్ సి ఇ ఓ సత్య నాదెళ్ళ వంటి ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చినవారే.

విభజన తర్వాత….

రాష్ట్ర విభజన తర్వాత 2022 సంవత్సరంలోల ఈ జిల్లా ను విభజించి 29 మండలాలతో కొత్తగా శ్రీ సత్య సాయి జిల్లాను  ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 503 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 28 లక్షల జనాభా ఉన్నట్టు అంచనా.