ONGOLE - EAGLE NEWS

ONGOLE

ప్రకాశం జిల్లా చరిత్ర…

“ఒంగోలు గిత్త” … ఇదీ  ఆ జిల్లా సత్తా..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాతి.  పొరుగు జిల్లాల చరిత్రే ఈ జిల్లాకు ఆధారం అయినప్పటికీ, ఎంతోమంది ప్రముఖులను అందించిన నేల ప్రకాశం. ఇప్పుడు మనం వందనం చేస్తున్న మువ్వన్నెల జాతీయ జండా ఇక్కడ పుట్టిన పింగళి చేతుల్లోనే  రూపుదిద్దుకుంది. ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య, కాకతీయ  రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు ఈ ప్రాంతాన్ని పరిపాలలించినట్టు చరిత్ర చెబుతోంది. 1972 వ సంవత్సరంలో లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. , బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికా, హాలండ్. మలేషియా లాంటి  దేశాలకు ఎగుమతి కావడం వీటి మరో ప్రత్యేకత. మలేషియాలోని  ఒక ద్వీపానికి ఏకంగా ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. 2002వ సంవత్సరంలో  భారత జాతీయ పోటీలకు వీర1 ఒంగోలు గిత్తను  చిహ్నంగా ఎంపిక చేశారు.  టంగుటూరి ప్రకాశం పంతులు, ఎర్రాప్రగ్గడ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య,  ఈ ప్రాంతానికి చెందినవారే.

విభజన తర్వాత….

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2022 వ సంవత్సరం ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాల బాపట్ల జిల్లాలో చేర్చారు. .  అదే విధంగా, జన్డుకురు నియోజక వర్గంలోని మండలాలు తిరిగి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లలో కలిశారు.జిల్లా లో మొత్తం 38 మండలాలు, రెండు లోక్ సభ స్థానాలు, 8 శాస్సన సభ స్థానాలు ఉన్నాయి.