“సుత్తి కొడవలి”పుత్రుడా..
ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…
ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…
ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…
తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడకదారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు…
కోల్ కతా అర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటుచేసుకోగా మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తయిందని గుర్తుచేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45…
ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య…
పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి తమ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న మామ బి.కె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు తోడు అల్లుళ్లు శనివారం ఆంద్రప్రదేశ్ లోని ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తాము మోసపోయామంటూ మొర పెట్టుకుంటున్నారు. అయ్యంగార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొండ కోనలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే కేరళ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఫలితంగా వందల మంది మట్టి ముద్దలుగా మారిపోయారు. రాళ్ల మధ్య నలిగి పోయారు. అనేక ప్రాంతాలు ఆర్తనాదాలతో పిక్కటిల్లాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న అనేక మందికి బాసటగా నిలిచారు మన వీర జవాన్ లు. అత్యంత క్లిష్టమైన చోట్లకు కూడా వెళ్ళి జనాన్ని అక్కున చేర్చుకున్నారు. కానీ, ప్రజలు చవు బతుకులతో పోరాడుతున్నారని అనుకున్నారేమో అందుకే ఇళ్ల ముందు అరుగులనే…
వాస్తవాలకు ప్రతిరూపంగా నిష్పాక్షిక వార్తా కథనాలు, విశ్లేషణలను నేట్టింటి పాఠకులను అందిస్తున్న”ఈగల్ న్యూస్” అనతికాలంలోనే విశేష ఆదరణ చూరగొంది. ప్రపంచం నలుమూలల తెలుగు నెటిజన్లనే కాకా, వివిధ భాషల వారు సైతం అనువదించుకొని “ఈగల్”ని ఇంటింటికి ఆహ్వానిచడాన్ని ఓ అదృష్టంగా, మంచి ప్రోత్సాహంగా భావిస్తోంది. ఇదే అభిమానం అందించాలని కోరుకుంటూ “ఈగల్” అందరికీ ధన్యవాదాలు చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రోజు దేశ రాజధానిలో ఢిల్లీలో సందడి చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పలురకాల చర్చల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విడివిడిగా కలిశారు. రానున్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగేలా చూడాలని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆర్ధిక సాయం చేయాలనే ప్రధాన అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలురకాల అభివృద్ది పథకాలకు చేయూత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మోడీకి…
నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. అటవీ అధికారులు వెంటనే వీడియో, ఫొటోలు తీసి విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో తాజా అడవిదున్న కనిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే…
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి.. సెన్సెక్స్ 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవన కాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది.. టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టి.సి.ఎస్., ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభ పడ్డాయి. ఎన్.టి.;పి.సి.,ఎస్.బి.ఐ., ఎల్‌అండ్‌టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి..
“ఈనాడు” గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. “ఈనాడు” దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర…
రెండు రోజుల కిందట కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆంద్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం లోకి ప్రవేశించాయి. నైరుతి సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఆంధ్రాణి తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి…
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళా ఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడు తుందని భావించారు. కానీ, “రెమాల్” తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ లోనూ జూన్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం…