INTERNATIONAL - EAGLE NEWS
IMG 20240724 WA0025

కుప్ప కూలి…

నేపాల్ రాజధాని ఖాట్మండు త్రి భవన్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం పడి పోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు…

Read More
IMG 20240722 WA0004

పోటీ చేయను…

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రేసులో వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ మనుగడ, దేశ ప్రయోజనాల కోసం పోటీ నుండి పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్ష పదవిలో పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హరీస్ ను బైడెన్ ప్రతిపాదించారు. కానీ, దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Read More
IMG 20240719 WA0035

షట్.. డౌన్…

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్‌ను విడుదల చేసింది. దాని తర్వాత విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి. పని చేస్తున్నప్పుడు ల్యాప్‌ టాప్‌లు షట్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్‌ను చూస్తున్నారు. మీ కంప్యూటర్ సమస్యలో…

Read More
Screenshot 20240719 151505 WhatsApp

అమెజాన్ అడవుల్లో..

అనేక వందల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే ఓ అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్ అడవుల్లో సంచరిస్తున్న “మాష్కో పైరో” అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను “సర్వైవల్ ఇంటర్నేషనల్ “అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరూ సమీపం లోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఆహారం కోసం ఈ తెగ వాసులు జనసంచారంలోకి వచ్చినట్టు…

Read More
IMG 20240718 WA0002

“పెద్దన్న”కి కరోనా…

అమెరికా అధ్యక్షుడు కు బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బైడెన్ కు వాక్సినేషన్ జరిగిందని, డెలావేర్ లో ఐసొలేషన్ లో ఉంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసొలేషన్ లో ఉంటూనే బైడెన్ తన విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబందించిన అంశాలను కమలా హ్యారీస్ చూసుకుంటారని బైడెన్ తెలిపారు.

Read More
bus peru

లోయలో పడ్డ బస్సు..

దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. అక్కడి స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజధాని లిమా నుంచి 40 మందికిపైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్ని సహాయక…

Read More
IMG 20240716 WA0018

మహా మనీషి…

సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం ఫోరం సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించిన ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేదకి కూడు, గూడు, గుడ్డ ఇలా దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కోన్నారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని పరిచయం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర…

Read More
IMG 20240714 WA0031

“ట్రంప్” పై కాల్పులు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం జరిగింది. కాల్పుల దాడిలో ఆయన తృటిలో బతికి బయట పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్కు కుడి చెవికి రాసుకుంటూ దూసుకు పోవడంతో ఆ చెవికి గాయం గాయమైంది. బుల్లెట్ చెవికి తాకడంతో అప్రమత్తమైన ట్రంప్ వెంటనే నేలపై వంగి పోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో…

Read More
Screenshot 20240712 211457 WhatsApp

జస్ట్ మిస్..

ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది. ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు.

Read More
IMG 20240712 WA0013

నదిలో రెండు బస్సులు..

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడ టంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 2 బస్సులో ఉన్న 63 మంది ప్రయాణి కులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థ లానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. నదిలో గల్లంతైన వారిని రక్షించేందు కు స్థానికులు కూడా అధి కార యంత్రాంగానికి…

Read More
download

రాయితీకి రష్యా చమురు

రాయితీ ధరతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసిన భారత రిఫైనరీలు కనీసం 10.5 బిలియన్‌ డాలర్ల అంటే సుమారు రూ. లక్ష కోట్లను ఆదా చేశాయి. ఒకప్పుడు మన దేశీయ చమురు వాణిజ్యంలో రష్యాకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మన దేశానికి వాణిజ్య భాగస్వాములుగా ఉన్న ప్రముఖ దేశాల జాబితాలో రష్యా కూడా చేరిపోయింది. భారత్‌-రష్యా సంబంధాలలో చమురుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల జాబితాలో చమురుదే…

Read More
IMG 20240709 WA0052

అమెరికాలో ఆ “నలుగురు”

అమ్మా, అయ్యల సంపాదన, వారి కలలను ఆసరాగా చేసుకొని పై చదువులు, ఉద్యోగాల పేరుతో దేశం కాని దేశంలో అడుగు పెట్టి బతుకు భారం కావడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. అనేక రకాల అభివృద్ధికి వాడాల్సిన తెలుగు తెలివిని ఉహించని విధంగా దుర్వినియోగం చేశారు. కట్టుదిట్టమైన నిబంధనలు ఉండే “పెద్దన్న” దేశం అమెరికాలో ఏకంగా మానవ అక్రమ రవాణా కు ఎత్తులు వేశారు. ఈ  నలుగురు దొరికి పోయారు. అమెరికా వీసా దొరకడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో…

Read More
modi putin1

దౌత్య విజయం..

ప్రధాని మోడీ రష్యా పర్యటనలో తొలిరోజు భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు.ఈ మేరకు ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పుతిన్‌ మాట ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

Read More
hanuman usa

హ్యూస్టన్ “హనుమాన్”

అమెరికా(హ్యూస్టన్ సిటీ)లోని అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో అత్యంత ఎత్తైన అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం రూపుదిద్దుకుంటున్నది. స్టేట్ ఆఫ్ యూనియన్ పేరిట రూపుదిద్దుకుంటున్న అభయ ఆంజనేయ విగ్రహం అమెరికాలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో 5వ విగ్రహం. అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం ఎత్తు 72 అడుగులు,గ్రౌండ్ లెవెల్ నుంచి 86.9 అడుగులు. 2023 ఆగస్టులో ఈ విగ్రహం పనులను చిన్న జీయర్ స్వామి భూమి పూజ చేసి ప్రారంభించారు. మరో…

Read More
us ambsidr

ఆలోచించండి..

రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. అమెరికా, సహా మిత్ర దేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకమని, భారత్‌ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు ఎరిక్ తెలిపారు. అమెరికా, దాని మిత్ర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు.

Read More