VIZAG - EAGLE NEWS

VIZAG

విశాఖ జిల్లా చరిత్ర

బంగాళాఖాతం ఒడ్డున అలరారుతున్న విశాల నగరం విశాఖ పట్నం. శివుడి పుత్రుడు  కుమార స్వామికి విశాఖ అనే పేరు ఉండడం, అతని నక్షత్రం కూడా విశాఖ కావడం, గుడి ఇక్కడతో ఈ నగరానికి ఆ పేరు వచ్చిందనే వాదన ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించినందువల్లే విశాఖపట్నంగా పేరు వచ్చిందనేది మరో కథనం.ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో లభ్యమైన శిలాశాసనంలోనే విశాఖపట్నం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాలక్యులు, తర్వాత రెడ్డి రాజులు,  నిజాం, మొగలు, కుతుబ్ షాహిలు ఈ ప్రాంతాన్ని పాలించారు.1700 సంవత్సరంలో ఈస్టిండియ కంపని దక్షిణాదిలో నెలకొల్పిన వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటి. మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉన్నప్పటికి, 18 వ శతాబ్దంలో బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాస్ ప్రెసిడెన్సిలో విశాఖ జిల్లాగా ఏర్పడింది. అప్పట్లో విశాఖ పట్టణాన్ని వాల్తేరుగా వ్యవహరించే వారు.

పర్యాటకం…

విశాఖ ఆహ్లాదకరమైన సముద్ర తీర ప్రాంతం. రామకృష్ణ , భీమునిపట్నం, రుషికొండ బీచ్ లు,  సింహాచాలంలోని ప్రాచీన దేవాలయం మంచి పర్యాటక కేంద్రాలు.స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, జెట్ స్కీయింగ్, పారా గ్లైడింగ్, హెలి పర్యాటకం వంటి సాహస క్రీడా సదుపాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అరకు లోయల అందాలు చూడ చక్కగా ఉంటాయి.

విభజన తర్వాత…

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2022వ సంవత్సరంలో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఈ జిల్లాను రెండు రెవిన్యూ డివిజన్లు, 11 మండలాలుగా విభజించారు. కొన్ని మండలాలు, ప్రాంతాలను అనకాపల్లి, సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో కలిపారు. ఉత్తర ఉత్తరావిశాఖ, తూర్పు విశాఖ,మ గాజువాక, దక్షిణ విశాఖ, పశ్చిమ విశాఖ, భీమిలి, పెందుర్తిలను అసెంబ్లీ నియోజక వర్గాలుగా, విశాఖ, అనకాపల్లి లను లోక్ సభ నియోజక వర్గాలుఉన్నాయి.