
“దయ్యాల”మాంత్రికుడు ఎవరు?
పాతికేళ్ల భారత రాష్ట్ర సమితి (భారాస) చరిత్రలో ఎవ్వరూ ఊహించని తుపాను సొంత ఇంటి నుంచే మొదలైంది. సాధారణంగా ఒక పార్టీలో కుంపటి గానీ, అసంతృప్తి గానీ వేరే నేతల నుంచి రాజుకుంటుంది. కానీ, భారాసలో మాత్రం పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కన్న కూతురు కవిత నుంచే ఉత్తరం రూపంలో గుప్పుమన్నది. దీంతో అనేక రకాల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. భారాసలో ఏక చక్రాధిపత్యం నడుస్తుందా? అధినేత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారా? పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందా? నేతల అభిప్రాయాలు,…