NALGONDA - EAGLE NEWS

NALGONDA

నల్గొండ జిల్లా చరిత్ర

కమ్యూనిస్టుల కంచుకోటగా పిలిచే నల్గొండ జిల్లాకు రజాకార్ల  కాలంలో మంచి గుర్తింపు వచ్చింది.  ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఈ జిల్లానే కేంద్ర బిందువు.  నల్గొండకు నీలగిరి అనే పేరు ఉండేది.   రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ  కమలాదేవి, రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. , దేశభక్తులు,  కమ్యూనిస్టులు స్వాతంత్ర సమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు  ఈ జిల్లాలో జన్మించారు.  

Nalgonda sagar 7

రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణ రావు, రావి నారాయణ రెడ్డి, పులిజాల రంగారావు, ధర్మ బిక్షం లాంటి ఉద్దండులు ఈ జిల్లా నుంచి వచ్చిన వారే.  నల్గొండ జిల్లాకు దక్షిణాన గుంటూరు,  తూర్పున కృష్ణా,  ఉత్తరాన యాదాద్రి,   ఈశాన్యాన సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి.  1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గలలో 12 కమ్యూనిస్ట్ లే గెలిచారు నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి ఉదారు . ప్రస్తుతం 40 లక్షలకు పైగా జనాభా కలిగి ఉంది. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అనేక ప్రముఖ కంపెనీలు ఇక్కడి నుంచి ఉత్పత్తులు జరుపుతున్నాయి.  నల్గొండలో 2007 లో మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్ట,  నాగార్జున  సాగర్ లు మంచి పర్యాటక కేంద్రాలు.

Nalgonda deyvarkonda Killa mukadavaram

విభజన తర్వాత….

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం, పునర్య్వస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాల నుండి 14 మండలాలతో భువనగిరి యాదాద్రి, 18 మండలాలతో సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేశారు.  26 పాత మండలాలతో నల్గొండ జిల్లాను  పునర్య్వస్థీకరించారు. జిల్లాలో నల్గొండ లోకేసభ స్థానం సహా,  దేవర కొండ, నాగార్జున సాగర్, మునుగోడు, నకిరేకల్, నల్గొండ, మిర్యాలగూడ వంటి 6 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.