NATIONAL - EAGLE NEWS
IMG 20240725 WA0021

“కంగన”కు నోటీసులు

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మండి నియోజక వర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. మండి నుంచి పోటీ చేసేందుకు తాను సమర్పించిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం చెప్పాలని కోర్టు నోటీసులు ఇచ్చింది.

Read More
IMG 20240712 WA0008

జై స్వరాజ్ “ఫెర్నాండెజ్”

జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్ జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్ ను జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. ముంబైలో ఉండే ఆంథోనీకి శుక్రవారం కేఎస్ఆర్ గౌడ ఆన్ లైన్ లో నియామక పత్రాలు పంపించారు. ఉన్నత విద్యావంతుడైన ఆంథోనీ గతంలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా 2010 వరకు పని…

Read More
IMG 20240708 WA0050

మొదటి “గ్యాస్” బైక్…

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ప్రారంభించిన బజాజ్బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ ఆధారిత మోటార్ సైకిల్ ‘ఫ్రీడమ్ 125’ ను విడుదల చేసింది. ఈ కొత్త మోటార్ సైకిల్ సీఎన్జీ కార్ల తరహాలోనే సీఎన్జీ, లేదా పెట్రోల్ తో నడుస్తుంది. కమ్యూటర్ మోటార్ సైకిల్స్ లో ఈ డ్యూయల్ ఫ్యూయల్ సెటప్ ఉండడం ఇదే ప్రథమం. ఈ సెగ్మెంట్ లోని ఇతర బైక్స్ తో పోలిస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 నిర్వహణ ఖర్చు చాలా తక్కువ….

Read More
IMG 20240708 WA0046

ముంచెత్తిన వానలు…

దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో, 300 మిల్లీ మీటర్లకు పైగా వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో…

Read More
IMG 20240704 WA0007

“పేద్ద” బస్సు..

విదేశాల్లో ట్రామ్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణించడానికి అనువుగా ఉండే ప్రాంతాల పై వివరాలు…

Read More
law 1

కొత్త చట్టాలు..

దేశంలో మూడు కొత్త న్యాయ చట్టాలు అమలు లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పిసి) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం (బీఎస్‌ఏ) రాబోతున్న విషయం తెలిసిందే. వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక…

Read More
IMG 20240701 WA0012

“మరాఠా”లో మహిళ సిఎస్

మహారాష్ట్ర ప్రధాన కార్య దర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారిని సుజాతా సౌనిక్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్ కి చెందిన ఈమె హెల్త్కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సిఎస్ గా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా…

Read More
tamanna krnt

“తమన్నా” పాఠం..

కర్ణాటక విద్యాశాఖలో వింత వివాదం తలెత్తింది. అందాల తార తమన్నాను గురించి పాఠ్యాంశంలో చేర్చడం రచ్చగా మారింది. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, నటుడు రణ్ వీర్ సింగ్ ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో…

Read More
5 mps

పార్లమెంట్ లో “పాంచ్”..

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికార పరిణామం కనిపించింది. ఒకే కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు లోక్ సభకు ఎంపిక అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అఖిలేష్‌ యాదవ్ కుటుంబం నుంచి ఐదుగురు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం. వీరు ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి గెలిచారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్రయాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్‌…

Read More
IMG 20240625 WA00091

పైకప్పు లీకేజీ..

అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవక ముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్కల కాంప్లెక్స్‌ లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపు దాలిస్తే ఆయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కూడా కష్టతరంగా మారే అవకాశముందని తెలిపారు. దీని పై స్పందించిన ఆలయ కమిటీ, అధికారులు హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టారు.

Read More
sea food

ఆహా.. ఏమి రుచి…!

భారత దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 సంవత్సరంలో భారీ పెరుగుదల కనిపించింది. సముద్ర చేపలు, రొయ్యల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి. స్వామి తెలిపారు. 2022-23లో రూ. 63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023-24లో రూ. 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని వివరించారు. భారత్…

Read More
IMG 20240625 WA0007

మళ్ళీ”బిర్లా” ..

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్…

Read More
IMG 20240624 WA0057

“లక్ష” ప్రయోజనాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం చెల్లించడం వల్ల భక్తులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని టిటిడి అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ఉన్నప్పటికీ ఆ ప్రయోజనాలను మరోసారి వివరించారు. దేవస్థానానికి విరాళంగా లక్ష రూపాయలు చెల్లించే దాత, అతని,ఆమె కుటుంబ సభ్యులకు సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన (5 గురు సభ్యుల వరకు) రూ.100 గది కేటాయించబడుతుంది. కుటుంబ…

Read More
IMG 20240623 WA0017

శబరి ఎంపిక..

పార్ల‌మెంటులో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక అయ్యారు. నంద్యాల ఎంపీ శ‌బ‌రిని ఎంపిక‌ చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై ఆమె చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై శ‌బ‌రి విజ‌యం సాధించారు.

Read More