KRISHANA - EAGLE NEWS

KRISHANA

కృష్ణా జిల్లా చరిత్ర

ప్రపంచ ప్రసిద్ది చెందిన కూచిపూడి నృత్య రూపం కూచిపూడి నుంచి పురుడు పోసుకుంది ఈ జిల్లాలోనే. మహిశాసురమర్ధిని దుర్గమాత నిలయం కృష్ణా జిల్లానే. రాజకీయంగానూ  ఏంతో చైతన్యవంతమైన  ఈ జిల్లా అనేక చారిత్రక ఘటనలకు సాక్ష్యం. మచిలీపట్టణం జిల్లా కేంద్రంగా ఉన్నపటికీ వ్యాపారాలకు, రాజకీయాలకు కేంద్ర బిందువు మాత్రం కనకదుర్గమ్మ కొలువైన  విజయవాడ మాత్రమే. కృష్ణా నది ఒడ్డున విస్తరించి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి కృష్ణ జిల్లా అని నామకరణ చేశారు. వివిధ కాలాల్లో  రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు, చోళులు, శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు చరిత్ర చెబుతోంది. గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన ఆధారాల మేరకు ప్రాంతాన్ని పల్లవులు 250 నుండి 340 వ సంవత్సరం వరకు పాలించారు.

1611 సంవత్సరం లో మచిలీపట్నం కేంద్రంగా ఆంగ్లేయులు కార్యకలాపాలు  మొదలయ్యాయి. మచిలీపట్నాన్ని ఆంగ్లేయుల తరువాత డచ్చి, ఫ్రెంచ్ వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1747-48 సంవత్సరం లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో  ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 సంవత్సరం లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు  కొండవీడు, నిజాంపట్నం, మచిలీపట్నంలాలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి కానుకగా ఇచ్చాడు.  ఆ తరువాత సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కృష్ణా జిల్లాను మొదట్లో  “మచిలీపట్నం జిల్లా” అని పిలిచేవారు. 1859 సంవత్సరం లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి కృష్ణా జిల్లాగా  మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. ఉయ్యూరు లోని  కెసీపి చక్కెర కర్మాగారం భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి కావడం గమనార్హం.

విభజన తర్వాత..

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. 2022 సంవత్సరం లో కృష్ణా జిల్లాలో విజయవాడతో కలిసిన ఉత్తర భాగాన్ని, అందులోని మండలాలను విదదీసి ఎన్టిఆర్ జిల్లాగా మార్చారు.  అదేవిధంగా, ఉత్తర ప్రాంతంలోనే మరికొన్ని మండలాలను విదదీసి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ప్రస్తుతం జిల్లాలో  మచిలీ పట్నం, విజయవాడ లోక్ సభ నియోజక వర్గాలు, మచిలీ పట్నం, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెడన, పెనమలూరు (పాక్షికం)లు  అసెంబ్లీ నియోజక వర్గాలుగా ఉన్నాయి. కృష్ణా జిల్లాను 3 రెవిన్యూడివిజన్లగా, 25 రెవిన్యూ మండలాలుగా విభజించారు. దాదాపు 18 లక్షల జనాభాను కలిగి ఉంది.