హైదారాబాద్ లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని బుధవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి . మహేశ్వర్ గౌడ్ మాట్లాడుతు యూనివర్శిటీ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి జూబ్లీహిల్స్‌లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 53 ఎకరాల భూమిని కేటాయించింది, అయితే తర్వాత టి.సాట్ కి దాదాపు 5 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా కేటాయించింది. కేబుల్ బ్రిడ్జి అభివృద్ధికి 4 ఎకరాల భూమిని ఉపయోగించారు. దుర్గం చెరువులో ఇప్పటికే మరో 5 ఎకరాలకు పైగా నీట మునిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు సేవలను అందించడానికి నిర్మించిన వివిధ కార్యాలయ భవనాలతో విశ్వవిద్యాలయం 35 ఎకరాల్లో విస్తరించి ఉంది . మల్టీ మీడియా భవనం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ కోసం ప్రత్యేక భవనాలను నిర్మించాల్సి ఉంది. నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఎంతో మంది సబ్బండ, పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే యూనివర్సిటీ లో ఉన్న బిల్డింగ్స్ ఇతర మౌలిక వసతులు సరిపోకపోవడంతో అటు విద్యార్థులు ఇటు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల అవసరాల కోసం భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ స్థలాలను ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్తులో తమ యూనివర్సిటీ అభివృద్ధికీ, విస్తరణకు అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఆలోచనను విరామించుకోకపోతే తీవ్రమైన ఉద్యమం ప్రారంభిస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ, అన్ని ఉద్యోగ సంఘాలు , దళిత బడగు బలహీనవర్గాల సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులూ జి. మహేశ్వర్ గౌడ్; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. వెంకటేశ్వర్లు; డా. నారాయణ రావు; డా. బానోత్ ధర్మ ఎం. రుషేంద్రమని; ప్రొ. పుష్పా చక్రపాణి , ప్రొ. మాధురి, ప్రొ . మేరీ సునంద, డా. పి. వెంకట రమణ, డా. ఎల్వీకే రెడ్డి, ఎండి. హబీబుద్దీన్, కాంతం ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైద; రజనీ కాంత్ మరియు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.