IMG 20240805 WA0023

చరిత్ర తిరగ రాస్తాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ ల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం అధికారుల్లో నైతికత దెబ్బతిన్నదని అన్నారు. ఇక్కడి…

Read More
IMG 20240803 WA0009

బాబుని కలిసిన చందన..

మిస్ యూనివర్స్ ఇండియాకు ఆంద్రప్రదేశ్ నుంచి అర్హత సాధించిన చందన జయరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు….

Read More
IMG 20240802 WA0010

ఫలితాలు చూపాలి…

ప‌థ‌కాలు అందించ‌డ‌మే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫ‌లితాలు సాధించే విధంగా ప్రణాళికతో ప‌ని చేయాల‌ని ఆంద్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. స‌చివాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం సమీక్ష చేశారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌తో సీఎం స‌మీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం,…

Read More
IMG 20240721 WA0011

“అనిత” అక్కసు…

గతంలో చంద్రబాబుకు ఇచ్చిన కారును ఇప్పుడు జగన్ కు ఇచ్చామని ఆంద్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇప్పుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ మహానటుడు జనాలకు కనిపించడం లేదని వేరే కారు ఎక్కావంటూ జగన్ పై విరుసుకుపడ్డారు. చంద్రబాబుకు పదేళ్ల పాటు వాడిన వాహనాన్ని కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా జగన్ కు కేటాయించారని, వైసీపీ చేసిన ఆరోపణలపై అనిత స్పందించారు. “బాబూ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు ఇంతకుముందు ఓసారి ఏం చేశావో గుర్తుకు…

Read More
IMG 20240711 WA0026

“గ్లోబల్ హబ్”గా విశాఖ..

గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే తమ హయాంలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు శ్రీకారం చుట్టామన్నారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సిబ్బందితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య పరికాల కోసం మెడిటెక్…

Read More
IMG 20240711 WA0018

మీ రుణం తీర్చుకుంటా..

ఉత్తరాంధ్ర “సుజల స్రవంతి” పూర్తైతే ఆ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ…

Read More
hariprsad mlc

సంక్షేమం కోసం కృషి చేస్తా

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతా యుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో…

Read More
dhoni cut

“వంద అడుగుల” అభిమానం…

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులున్నారు. అందులో తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే,  తాజాగా తెలుగు వాళ్లు ధోనిపై తమ వంద అడుగుల అభిమానం చాటారు. ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని పుట్టిన రోజు నాడు  ఈ కటౌట్‌ను ఫ్యాన్స్…

Read More
IMG 20240706 WA0053 1

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read More
polvrm team2

“పోలవరం” లోతెంత..?

పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది? ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో…

Read More
IMG 20240629 WA0039

దళారీల నియంత్రణ

శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్ లైన్ సేవలకు ఆధార్ తో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం ఉందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) అధికారులు, టిసిఎస్, జీయో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇది వరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి…

Read More
IMG 20240629 WA0036

నోటిఫై….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవ్వగా మిగితా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read More
IMG 20240625 WA0036

కదలండి…

కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ తారిక్ అన్వర్ నిన ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కలిశారు. షర్మిల నేతృత్వంలో జరుగుతున్న అనేక పార్టీ వ్యతిరేక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో కేవలం షర్మిల ఒంటెత్తు పోకడలు మూలంగానే భారీ నష్టం కలిగిందని ఆయనకు వివరించారు. అంతేకాక,షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో అధిష్ఠానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర…

Read More
IMG 20240625 WA0015

కేశవ్ తో పాత్రికేయులు…

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని పాత్రికేయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎపిడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, కార్యదర్శి ఆయుఫ్ బాషా…

Read More