GUNTUR - EAGLE NEWS

GUNTUR

గుంటూరు జిల్లా చరిత్ర

గుంటూరు మిర్చి… తెలుగు రాష్ట్రాలే కాదు, పొరుగు రాస్త్రాలజి సైతం ఆ రుచి తెలుసు. విజయవాడ సమీపం లోనే  ఉన్న మరో జిల్లా గుంటూరు. రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరం. ఈ జిల్లా మిరప, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచింది. ఆసియాలో అతి పెద్ద ఎండమిర్చి మార్కెట్ గుంటూరులో ఉంది.  గుంటూరుని సంస్కృతంలో “గర్తపురి” అనే వారు.  వేంగీ తూర్పు చాళుక్య రాజు శాసనాలలోనూ దీని ప్రస్తావన ఉంది. అంతేకాక 1147 – 1158 వ  సంవత్సరపు శాసనాలలో కూడా ఉంది.  దీని అర్థం నీటి కొలనుల మధ్య ఉన్న ప్రదేశం అంటే, గుంట దగ్గరలో వుంది కాబట్టి “గుంటఊరు” అని పిలిచే వారు. కాలక్రమంలో అదే  గుంటూరు గుంటురుగామారిందని పరిశీలకుల అభిప్రాయం.  2వ శతాబ్దం నుంఛి 3వ శతాబ్దం వరకు ఈ జిల్లా కూడా శాతవాహనుల సామ్రాజ్య పరిధిలో ఉంది.  8 వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకూ ధరణికోటను రాజధానిగా చేసుకుని కోట వంశస్థులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు. 16వ శతాబ్దం చివరిదశలో యూరోప్ దేశస్తుల రాకతో ఈ నగరానికి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది. 1752 వ  సంవత్సరంలో  ఫ్రెంచివారు కొండవీటి కోట నుండి గుంటూరుకి ముఖ్యపట్టణాన్ని మార్చారు. బ్రిటీష్ పరిపాలన సమయంలో ప్రముఖ ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సెన్ 1868 వ సంవత్సరం ఆగస్టు 18వ తేదిన ఇక్కడ నుండి సూర్య గ్రహణాన్ని దర్శింఛి, హీలియం  అనే మూలకాన్ని కనుగొన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నందమూరి తారక రామారావు ఇక్కడి  ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బిఎ విద్యాభ్యాసం చేశాడు. కేంద్రీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం గుంటూరు సమీపంలోని “లామ్“ వద్ద ఉంది. వివిధ వ్యవసాయ ఉత్పత్తులలో సరికొత్త  వంగడాలను కనుగొనడానికి ఇక్కడ పరిశోధన జరుగుతుంది.ఈ జిల్లా ఒకప్పుడు  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.

విభజన తర్వాత…

ప్రత్యెక రాష్ట్రం ఏర్పడ్డాక 2022 వ సంవత్సరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది.  7 అసెంబ్లీ నియోజక వర్గాలు, 2 రెవిన్యూ డివిజన్లు, 18 మండలాలు, 2 నగరపాలక సంస్థలు, 2 పురపాలక సంస్థలు,, 278 గ్రామపంచాయితీలున్నాయి. తెనాలి, గుంటూరు రెవిన్యూ డివిజన్లు. గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గంతో పాటు గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, పత్తిపాడులు శాసన సభ నియోజక వర్గాలుగా ఉన్నాయి.