“పేపర్” మంచాలతో మోసం..!
జనం దృష్టిలో అదో పేరున్న బహుళజాతి మాల్. హంగూ ఆర్భాటంతో నగరాల నడిబొడ్డున హంగామా చేయడం, వినియోగదారులను ఆకర్షించేందుకు ఎత్తులు వేయడంలో దిట్ట. ప్రారంభంలోనే లాభాలు దండుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అందుకే దుకాణం తెరిచే నాటికి ఇబ్బడి ముబ్బడిగా లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రసార సాధనాలు, హోర్డింగుల ద్వారా ప్రకటనలు గుప్పిస్తారు. కానీ, ఆ మాల్ లో విక్రయించేది మాత్రం పై మెరుగులు దిద్దిన ఉత్పత్తులు మాత్రమే అనేది అమాయక వినియోగదారులకు తెలియని వాస్తవం. కొనుగోలు చేసిన…