KARIMNAGAR

కరీంనగర్ జిల్లా చరిత్ర

Karimnagar

తెలంగాణా ప్రాంతంలో వరంగల్ తర్వాత అంత చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న జిల్లా కరీంనగర్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం.ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏ ఏనుగులు (కరి) ఎక్కువగా తిరగడం వల్ల కరినగరంగా ఫ్యవహరించే వారనే వాదన ఉంది.  కాలక్రమేణా అదే కరీంనగర్ గా మారిందని నమ్మకం.  తెలంగాణా రాష్ట్రంలో ఇది 5వ అతి పెద్ద నగరం. సయ్యద్ కరీముద్దీన్ ఈ ప్రాంతానికి పేరు పెట్టాడు కాబట్టి కరీంనగర్ గాపిలుస్తున్నారని మరో వాదన.  కోటిలింగాల పరిసరాల్లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఈ ప్రాంతాన్ని అసఫ్ జాహిలు, శాతవాహనులు, మౌర్యులు , పాలించిన దాఖలాలు లభించాయి. జగిత్యాల జిల్లాలో ఉన్న కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధానిగా ఉండేది. జిల్లాలో గ్రానైట్, ఆగ్రో, ఇటుకల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ జరుతుగున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటానికి ఎంపిక చేసింది. కరీంనగర్ లో  న్యాయ కళాశాల, వైద్య కళాశాలతో పాటు టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లు  కూడా ఉన్నాయి.