RANGAREDDY

రంగారెడ్డి జిల్లా చరిత్ర

airport p

పరిపాలన సౌలభ్యం కోసం 1978లో  రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కొన్ని మండలాలను  విడదీసి దీన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాద్ జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది.     ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నా రెడ్డి తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన   కొండా వెంకట రంగారెడ్డి, కాటం లక్ష్మీనారాయణ, వెదిరే రాంచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే.  శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన  కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా రంగారెడ్డి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీనది. జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి . ఈ జిల్లా పరిధి లోని శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

పరిశ్రమలు …

జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమలే కాకుండా పలు పారిశ్రామిక వాడలున్నాయి. పేరుగాంచిన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ, ఐడీపీఎల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎంటీ  లాంటి పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. కుత్బులాపూర్ మండలంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ, మేడ్చల్‌లో జీటీ అల్మాక్స్, తుర్కపల్లి, బోడుప్పల్‌లో జీవీకే బయోసైన్స్, ఉప్పల్‌లో హెరిటేజ్ ఫుడ్స్, మౌలాలీలో హిందుస్తాన్ కోకాకోలా బెవెరేజెస్, గుండ్లపోచంపల్లిలో ఇంటగ్రేటెడ్ ఫార్మాసీటికల్స్, చెర్లపల్లిలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ ఉన్నాయి.

విభన తర్వాత…

జిల్లాల పునర్య్వస్థీకరణ తరువాత ఈ జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు  27 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 33 తో కలుపుకొని 604 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.