sry govinda cf

“గోవిందా”… మన్నించు….!

కృత, త్రేతా, ద్వాపర యుగాలను ఏలిన ఓ స్వామి… నీకు కలియుగ పోకడలు తెలియనివి కాదు. ఈర్ష్య ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తులు-పై ఎత్తులు ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న సంగతి జగమెరిగిన సత్యమే. కాకపోతే, ఈ కలియుగంలో అవి కాస్తా పరాకాష్టకు చేరడం ఏడు కొండల మీద నిశ్చల రూపుడివైన నిన్ను కన్నెర్రకు గురిచేశాయి. సందేహం లేదు..సకల జనుల సంతోషాన్ని కోరే నీకు ఆగ్రహం తెప్పించే అనేక విషయాలు తిరు గిరులను చుట్టు ముడుతున్నాయి.  పవిత్ర…

Read More
IMG 20241221 WA0018

అమెరికా “షట్‌డౌన్‌” ?

ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అమెరికా అడుగులుఅధికార మార్పిడికి సిద్ధమవుతున్న అమెరికా ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అడుగులు వేస్తున్నది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ‘షట్‌డౌన్‌’ తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికాను నెట్టివేస్తున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి గతంలో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌…

Read More
benfit cf

బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని…

Read More
jnj sup2 c copy

అంతిమ తీర్పు – అయోమయం..!

భారత రాజ్యాంగం…బ్రిటిష్ పాలకుల మూలాలు ఉన్న దీన్ని, అందులోని అధికరణలను ప్రతీ భారతీయుడు నేటికీ విధిగా అనుసరించాల్సి ఉంది. ప్రతీఒక్క నిబంధనల్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యంలో తప్పదు.దేశ పౌరుల గౌరవాన్ని, తప్పు, చెడులను పర్యవేక్షిస్తూ గాడిన పెట్టే బాధ్యత దేశంలో న్యాయ వ్యవస్థది. దానికి అందరూ తలవంచక తప్పదు. విశాలమైన న్యాయ శాస్త్రంలో తలపండిన మూర్తులు చెప్పిందే శిరోధార్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదే రాజ్యంగం దేశ పౌరులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు ప్రశ్నించే…

Read More
Screenshot 20241203 094717 WhatsApp

అలల మధ్యకు సరే.. అడవి బిడ్డలు మరి..!

గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల లెక్కలతో గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుతానికి అడవి బిడ్డల గోడు పట్టకలోవడం విచారకరం. విశాఖ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటనే పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుని ప్రశ్నిస్తోంది. వైట్ కాలర్ దొంగలను వెతకడానికి పడవలు వేసుకొని…

Read More
shrprabh C

“వాడెవడు”…”ఆయన” ఎవరు..!

జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందా తనానికి మచ్చ పడుతోంది. ఆయన ఇతరుల పట్ల ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా ఉంటారనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలగలుపుగా ఉండే ఆయన అకాల మరణం నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల వారికి ఎప్పటికీ తీరని లోటే. ఇప్పుడు అది విషయం కాదు. కానీ, ఆ మహానేత వారసులుగా, ఆయన రాజ నీతిని అనుసరించాల్సిన బిడ్డలు అదుపు తప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది….

Read More
suprim jnj cf copy

“సుప్రీమ్” కూల్చిన ఇంటి కల..!

భారత న్యాయ వ్యవస్థ నిజంగా అత్యంత గౌరవ ప్రదమైనది. అందుకే దాని పని తీరును ప్రశ్నిస్తే నేరం, తెలివితక్కువ తనం. అది ఒక రాజ్యాంగ ఉల్లంఘన.. తెలిసి చేసినా, తెలియక చేసినా సుమోటో కింద విచక్షణ అధికారంతో కేసులు.. మరి అదే కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కొత్త తీర్పులు వెలువడితే..ఎవర్ని ప్రశ్నించాలి? దిక్కు ఎవరు? న్యాయ శాఖ మంత్రిని కలవాలా? రాజ్యాంగ నిబంధనల అమలు కర్త రాష్ట్రపతిని ఆశ్రయాయించాలా? ఒకవేళ ఆ సాహసం చేస్తే అదీ…

Read More
adani c

మోడీ పెంచిన “మనీ”కొండ..!

నరేంద్రమోడీ, నీరబ్ మోడీ, అదానీ… దేశంలో 2014 వరకు ఈ మూడు పేర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే జనానికి తెలుసు. ఎన్.డి.ఎ. అధికారం చేపట్టక ముందు వరకు వ్యాపార రంగంలో అదానీ ఒక అడ్రస్ లేని వ్యక్తి. నీరబ్ మోడీ జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనామకులు రాజకీయాల అండదండలతో దేశ ప్రజలు చూస్తుండగానే అనతి కాలంలోనే అపర కుబేరులుగా మారారు. వీళ్ళ అక్రమ మార్గాల ధాటికి దశాబ్దాలుగా వివిధ వ్యాపారాల్లో…

Read More
nude c

“నగ్న”మైన సనా”తనం”..!

రాజకీయ లబ్ధి కోసం కొత్తగా జడలు విప్పుకుంటున్న “సనాతన ధర్మ” నినాదం దారి తప్పుతోంది. దేశం లోని ప్రతీ హిందువులో అంతర్గతంగా దాగి ఉన్న ఈ ధర్మ సిద్ధాంతాన్ని కొత్త కోణంలో ప్రేరేపించి పబ్బం గడుపు కోవడానికి కొన్ని శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. దీని కోసం “ఆధునిక” సమాజాన్ని కాస్తా “ఆటవిక” సమాజంగా వెనక్కి లాగే కుతంత్రాలు ఊపందుకున్నాయి. కొందరు  అధికారమే లక్ష్యంగా “ధర్మం” ముసుగులో మున్నెన్నడూ లేని  విధంగా దిగంబరులను జనం మధ్యకు పురిగొల్పే దుస్సాహసానికి …

Read More
jail power cf

అరెస్టు ఐతే “అధికారమే”..!

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…

Read More
IMG 20241104 WA0003

“హోమ్”ఇస్తే ఏం చేస్తావ్..?”

హోమ్ శాఖ మంత్రి ఐయితే ఏం చేస్తారు? జగన్ మీద ఉన్న కేసుల పై పోరాడుతారా? చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టి వేస్తారా? తమిళనాడులో మీ పై ఉన్న కేసు నుంచి బయటికి వస్తారా? వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ని అరెస్టు చేస్తారా? రోజా పై కక్ష సాధిస్తారా? కొద్ది రోజులుగా అధికమైన అత్యాచారాలను దగ్గరుండి అదుపు చేస్తారా? మీ ఆలోచనలో అంతరార్ధం ఏమిటి? ఒక దళిత మహిళ ప్రాముఖ్యమైన స్థానంలో ఉండడం…

Read More
IMG 20241106 WA0005

ఇక స్వర్ణ యుగమే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ” విక్టరీ స్పీచ్” లో మాట్లాడుతూ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని ఆయన హామీ ఇచ్చారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని…

Read More
IMG 20241028 WA0001

శుభాకాంక్షలు “సీనన్నా”..

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.

Read More