నీలోఫర్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎన్. రవికుమార్ ను హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ప్రధాన ఆసుపత్రులకు తాత్కాలిక పద్ధతిన 22 మంది వైద్యులకు పలు ఆసుపత్రులకు సూపరిండెంట్లుగా, ప్రిన్సిపాల్స్ గా నియమిస్తూ వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా నీలోఫర్ ఆసుపత్రిలో వైద్య విభాగంలో ప్రొఫెసర్ గా, వైద్యుడిగా చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పీడియాట్రిక్ విభాగం అధిపతిగా, వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్ రవికుమార్ ను ఆస్పత్రి సూపరింటెండెంట్ గా నియమించారు. పీడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్, వైద్యుడిగా పనిచేశారు డాక్టర్ రవికుమార్. కేఎన్ఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ పీజీ స్టడీ బోర్డ్ చైర్మన్ కూడా పనిచేశారు. 2022 లో ఐఏపి కేంద్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా సేవలందించారు. ఇక డాక్టర్ రవికుమార్ నీలోఫర్ హాస్పిటల్లోనే జన్మించడం విశేషం.