NELLOR - EAGLE NEWS

NELLOR

నెల్లూరు జిల్లా చరిత్ర ….

సంయుక్త మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ “నెల్లివూరు “… అదే నేడు మనం పిలుస్తున్న నెల్లూరు. ఈ ప్రాంతం అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతాన్ని తమిళంలో “నెల్లి “ వూరుగా పిలిచేవారు. “నెల్లి” అంటే ఆ భాషలో వరి అని అర్ధం. అందుకే  నెల్లివూరు  అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఇదే పదం నెల్లూరుగా రూపాంతరం చెందినట్టు చరిత్రకారుల అభిప్రాయం. నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరించేవారు. ఈ పట్టణ సమీపంలోని  అడవుల్లో  సింహలు ఎక్కువగా  ఉండడం వల్ల  ఈ పేరు వచ్చిందని మరి కొందరి అభిప్రాయం. అంతేకాక, విక్రమసింహుడి ఆధీనంలో ఉన్నదున అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువబడివుండవచ్చునని భావిస్తున్నారు. ఈ ప్రాంతం 1953వ సంవత్సరం  అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం  ఏర్పడే వరకు సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఉంది. 1956 నవంబరు 1వ తారీఖున భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఒక భాగం మారింది.  పొట్టి శ్రీరాములు గౌరవార్ధం “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా”గా 2008వ సంవత్సరం  జూన్ 1 న మార్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వృక్షజాలతో, జంతుజాలంతో సమృద్ధి కలిగి ఉంది. జిల్లాలోని  సూళ్ళూరు పేట వద్ద ఉన్న పులికాట్ సరస్సు అరుదైన పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్ట్రోక్స్, గ్రే పెలికాన్స్, సీగల్స్ ఇవే కాక అనేక పక్షులకు పులికాట్ ఆలవాలం.ఈ  సరస్సు తీరంలో నేలపట్టు పక్షి సంరక్షణకేంద్రము 486 కిలోమీటర్ల మేర  విస్తరించి ఉంది. 160 సైబేరియన్ కొంగల జాతులు  ఉండడం గమనార్హం. సరస్సు వద్ద ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఉత్సవం జరుపుకుంటుంది. చేపల పులుసుకు మరు పేరు నెల్లూరు అనడంలో ఆశ్చర్యం లేదు. బెజవాడ గోపాలరెడ్డి,  నేదురుమల్లి జనార్ధన రెడ్డి,  పుచ్చపల్లి సుందరయ్య, ఎం. వెంకయ్య నాయుడు వంటి వారు ఈ జిల్లా నుంచి వచ్చిన వారే.

విభజన తర్వాత …

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత 2022వ సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా  ఈ జిల్లాలోని కొన్ని మండలాలు, ప్రాంతాలను విదదీసి  తిరుపతి జిల్లలో కలిపారు. అంతేకాక, గతంలో ప్ర్రకాశం జిల్లాలో చేరిన ప్రాంతాలను తిరిగి ఈ జిల్లాలో కలిపారు.  జిల్లా జనాభా ‘సుమారు 28 లక్షల వరకు ఉంటుంది. నెల్లూరు లోక్ సభ స్థానంతో పాటు తొమ్మిది శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.