IMG 20240516 WA0004

‘కులం’ తర్వాతే “పంచాయతీ”

రాష్ర్టంలో కుల గణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్పి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కుల గణన చేపట్టి, కులాల…

Read More
swaraj

ముమ్మర ప్రచారం..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Read More
IMG 20240418 WA0007

మల్కాజిగిరి బరిలో “బాషా”

దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు…

Read More
IMG 20240406 WA0018

జైల్ లో “ఇల్లు” కట్టిస్తా..

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన “కాంగ్రెస్ జన జాతర’ సభలో ఆయన ప్రసంగించారు. “కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదనీ, రేవంత్ రెడ్డిననీ, ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైలులో పెడతామని హెచ్చరించారు. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం” అని రేవంత్…

Read More
IMG 20240403 WA0024

ఆదుకొనే బాధ్యత …

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గల్ఫ్ జెఏసీ బృందం కృతజ్ఞతలు తెలిపింది.గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం ముఖ్యమంత్రిని కలిసి హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద…

Read More
IMG 20240331 WA0004

కాంగ్రెస్ లోకి ” కడియం”..

భారత రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీహరి సహా అయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.

Read More
IMG 20240327 WA0011

మరో ఘనత ..

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల ఉండగా, తాజాగా మరో భారతీయుడు ఆ సంస్థలో అగ్ర పదవి లో నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని కంపెనీ నియమించింది.ఆయన 2001 నుంచి మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నారు.గత మూడు సంవత్సరాలుగా సంస్థ కార్పొరేట్ వ్యవహారాల విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

Read More
press

సమస్యలు సమ్మతమే…

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, “జర్నలిస్ట్స్ డిమాండ్ డే”కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్…

Read More
IMG 20240317 WA0041

రన్ “రాణీ” రన్….!

తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆదివారం నిర్వహించిన ‘శారీ రన్’ కార్యక్రమం విజయవంతం అయింది. పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు చీరకట్టులో పరుగులు పెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు….

Read More
IMG 20240315 WA0188

కవిత ఇంట్లో సోదాలు…

తెలంగాణలో మరో కుదుపు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఅర్ కుమార్తె, భారాస ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ. డి.) సోదాలు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు విచారణలో భాగంగా సుమారు 10 మంది అధికారుల బృందం సోదాలు చేపట్టినట్టు సమాచారం..

Read More
IMG 20240314 WA0060

కొత్త ప్రిన్సిపల్…

ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ నరేంద్ర కుమార్ ని ప్రభుత్వం నియమించింది. చిన్న పిల్లల శస్త్ర చికిత్స నిపుణులుగా పేరున్న ఆయన ప్రిన్సిపాల్ గా నియామకం కావడం పట్ల పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More
IMG 20240312 WA0010

సమస్యలు పట్టించుకోండి..

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల క్షేమం’ కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిపిసిసి ఎన్నారై విభాగం చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసీ ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల, ఏనుగు రమేష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం…

Read More