
చైనాతో ఇలా చేద్దాం…
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు….