“అల్లం”సర్ అప్పుడేం చేశారు ?

allam c

పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం కూడా అనిపిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు స్థలాలు కేటాయించండి అంటూ సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆనాడు మీడియా అకాడమీ ఛైర్మన్ గా వెలుగొందిన సదరు అల్లం ఇదే మాట అప్పటి దొరకు, దొర కుమారునికి ఎందుకు చెప్పలేదనేది ప్రశ్న. వాళ్లను ఎందుకు నిలదీయలేదనేది జర్నలిస్టుల వాదన, వేదన.  అల్లం రెండేళ్ల కిందట ఇదే మాట మాట్లాడి ఉంటే వెయ్యి మంది విలేకరులు ఈ రోజు ఇబ్బందుల్లో పడే వారు కాదనేది నగ్నసత్యం.

pet bashir land board
కేటాయించిన భూమిలో ..

జె.ఎన్.జె. సొసైటికి కేటాయించిన భూములలో ఇంటి స్థలాలు ఇవ్వండి అంటూ  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అప్పటి మీడియా అకాడమి చైర్మన్ గా ఉన్న ఇదే అల్లం కనీసం అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కి సమస్యను వివరించే  ప్రయత్నం కూడా చేయ లేదు. సొసైటీ నేతలను కలిసే ఆలోచనా చేయలేదు. ఈ నిర్లక్ష్యం ఫలితమే జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి ఎప్పుడో 18 ఏళ్ల కిందట దక్కిన భూములు నేడు సమస్యల్లో పడ్డాయి. చేతికి అందిన స్థలాలు భారాస ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల దిక్కు తోచని స్థితికి చేరాయి. ఈ విషయం తెలిసి కూడా అల్లం ఇప్పుడు  అవాకులు పేలడం హాస్యాస్పదం. ఆయన మాటలు వింటే సామాన్య జర్నలిస్టులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. తమ హయంలో నిర్లక్ష్యం చేసిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో  చేయించాలి అనేది  భారాస ఎత్తుగడగా కనిపిస్తోంది. దీనికి అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం పెట్టాలని కవిత, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అల్లం నారాయణ డిమాండ్ చేయడం ఉదాహరణలుగా చూపవచ్చు. నిన్న జర్నలిస్టు మిత్రులతో  ఆయన మాట్లాడిన తీరు విస్తుపరుస్తోంది. ఆయన మాటలు ఇలా ఉన్నాయి.

pres acadmy
అకాడమీ భవనం..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. నాంపల్లి లోని టీఎన్జీవో భవన్లో జరిగిన హైదరాబాద్ అడహక్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జర్నలిస్టులకు నివాస స్థలాలు అందించే విషయంలో ప్రభుత్వాలు అలసత్వ వైఖరిని అవలంబిస్తున్నాయని, వెంటనే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. గత కొంతకాలంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు కార్పొరేట్ వైద్యశాలల్లో పనిచేయటం లేదని, ఈహెచ్ఎస్ తోపాటు జెహెచ్ఎస్ కూడా అన్ని ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కార్డులను తగ్గించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదే జరిగితే ఆందోళన బాట తప్పదని ఆయన హెచ్చరించారు.

jnj hanumth ravi
జె.ఎన్.జె. పోరు…

ఇక్కడ అల్లం నారాయణ ఎవరి ప్రోత్బలంతో మాట్లాడారు అనేది ముఖ్యం. అయన ఈ రోజు మాట్లాడిన మాటలు ప్రతీ జర్నలిస్టు అన్ని విధాలుగా ఆహ్వానిన్చాదగ్గవ్వే. కాని, ఇదే ఆలోచన కెసిఆర్ ప్రభుత్వ హయంలో చేసిఉంటే సమస్య సులువుగా పరిష్కారం అయ్యోదని ఇతర జర్నలిస్టు సంఘ నేతలు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయ పడుతున్నారు.   ఉమ్మడి రాష్ట్రంలో జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గోపన పల్లి ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేతాయిన్చినట్టే  ఇప్పుడు తెలంగాణ ప్రాంత విలేకరులకు సైతం స్థలాలు కేటాయించాలి. అది ఏ ప్రభుత్వమైనా సరే భాధ్యతగా తీసుకోవాలి, ఆ దిశలో అడుగులు వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో  అర్హత ఉన్న ప్రతీ జర్నలిస్టుకి ఇంటి స్థలం రావాలి.. ప్రభుత్వ పెద్దలు ఇచ్చి తీరాలలనేది జర్నలిస్టుల మూకుమ్మడి డిమాండ్. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితితులను బట్టి చుస్తే ప్రభుత్వం తలచుకుంటేనే జర్నలిస్టుల ఇంటి జాగాల సమస్య పరిష్కారం అవుతుదనేది స్పష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *