పారిస్ నగరం రావణ కాష్టంలా అట్టుడుకుతోంది. అంతకంతకు చెలరేగుతున్న అల్లర్లతో పౌర జీవనం అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న బితావాహ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఒక్కసారిగా భగ్గుమన్న నిరసన జ్వాలలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఆరు కోజులుగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. . ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. పలు భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. దీంతో పారిస్ శివారులోని క్లామర్ట్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. మరోవైపు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్ ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుమారు 50 పోలీసు స్టేషన్ ల పై దాడులు జరగగా దాదపు 150 మంది పోలీసులు గాయపడ్డారు. 15 వదలకు పైగా వాహనాలను ఆహుతి చేసునట్టు, 2500 చోట్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. నిరసనకారులు 250కి పైగా భవనాలకు నిప్పుపెట్టారు. ఇప్పటి వరకు 14 వందల మందిని అరెస్టు చేసినట్టు పారిస్ పోలిసులు తెలిపారు. అయితే, ఎన్ని దుకాణాలు దోపిడీకి గురయ్యయనే విషయం తెలియాల్సి ఉంది.