ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజాజీవన అతలాకుతలం అవుతోంది. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రవాణా స్తంభించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రామ్ఢ్ గ్రామంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటించేందుకు ప్రయత్నించగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగక పోవడంతో ఉపిరి పీల్చుకున్నారు.