పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని వెంటనే వారికి అప్పజెప్పాలని వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.హైదరాబాద్ జర్నలిస్టుల న్యాయమైన ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ “ధర్నా చౌక్” వద్ద చేపట్టిన ధర్నా కు రాజకీయ పార్టిలు, ప్రజా సంఘాలు తరలి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు వి. హనుమంత రావు, మల్లు రవి, బిజెపి నేతలు ఈటెల రాజేందర్, రామచంద్ర రావు, విమలక్క హాజరై జర్నలిస్టులకు అండగా నిలుస్తామన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు తీర్పు మేరకు వెంటనే సొసైటికి బదలాయించాలని డిమాండ్ చేశారు.