పాఠాలు చెప్పకుండానే …

arts collage

ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉండగా కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని విద్యార్ధులు అసంతృప్తి వ్యక్త్రం చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఇద్రిక్థత నెలకొంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *