విశ్వసుందరి “థాయ్”…

miswarld c w scaled

తెలంగాణాలో మూడు వారాల పాటు కోలాహలంగా సాగిన ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు ముగిశాయి. హైదరాబాదులోని హై టెక్స్ వేదికగా జరిగిన  గ్రాండ్ ఫినాలేలో మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాతా చుయాంగ్‌స్రి  72వ మిస్ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్నారు. గత ఏడాది  మిస్ వరల్డ్‌ విజేత గా  నిలిచిన పోలాండ్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఆనవాయితీగా ఆమెకు కిరీటం అలంకరించారు.  ఈ పోటీలో పాల్గొన్న అందగత్తెలు  సోయగంతో పాటు సృజనాత్మకత,  తెలివితేటలు, మానవీయతను చాటుకోవడం లో పోటీపడ్డారు. వివిధ ఖండాలకు చెందిన 108 మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ అందాల పోటీలలో మిస్ ఇథియోపియా రెండో స్థానం, మిస్ పోలాండ్ మూడో స్థానం, మిస్ మార్టినిక్ నాలుగో స్థానంలో నిలిచి తమ అందాన్ని చాటుకున్నారు.

miss 25
mis in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *