ఆలోచించండి..
రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. అమెరికా, సహా మిత్ర దేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకమని, భారత్ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు ఎరిక్ తెలిపారు. అమెరికా, దాని మిత్ర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు.