జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వి.కే.సింగ్ బిడెన్ కి స్వాగతం పలుకుతారు. అమెరికన్ల ప్రయోజనాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిపై చర్చించనున్నట్టు బిడెన్ అమెరుకా నుంచి బయలు దేరే ముందు వెల్లడుంచారు. రాత్రి 8 గంటలకు బిడెన్, మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ భారత్ రావడం ఇదే తొలిసారి. రష్యా, చైనా దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొనడంలేదు. ఆస్ట్రేలియా, బ్రజిల్, కెనడా, ఫ్రాన్స్, అర్జెంటీనా, జర్మనీ, ఇండోనేసియా, ఇటాలి, జపాన్, మెక్సికో,సౌత్ కొరియా,సౌదీ అరబియా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.
