ఆమె పేరు టేలర్ స్విఫ్ట్. వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చింది. బాల్యం మొత్తం పంటపొలాల మధ్యనే సాగింది. కానీ ఎందుకో ఆమె మనసు సంగీతం వైపు మళ్ళింది. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే అందులోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ పాటు ఎంత ప్రయత్నించినా మ్యూజికల్ థియేటర్ లో స్థానం దొరకలేదు. అయినా పట్టు సడలలేదు. లక్ష్యం ఒక్కటే అమెను ముందుకు తెసుకుపోయింది. దేశీయ సంగీతంపై దృష్టి పెట్టి 14 ఏళ్ల ప్రాయంలోనే రచయితగా మారి సత్తా చాటింది.
ఈ ఏడాది మే నెలలో ఫిలడేల్పియాలో నిర్వహిం చిన సంగీత ప్రదర్శనలు ఆ నగరాన్ని జనసంద్రంగా మార్చాయి. గ్రామీ అవార్డులలో గతంలో ఎన్నడూ లేని విధంగా డజను పురస్కారాలు సొంతం చేసుకుంది. అంతేకాదు మరెన్నో అవార్డులు, రివార్డులను టేలర్ తన ఖాతాలో వేసుకుంది. “ఎరాస్” పేరుతో ఐదు ఖండాల్లోని 131 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి టిక్కట్ల అమ్మకాల్లోను మరో రికార్డు సాధించింది. ఈ ఏడాది బిలియన్ డాలర్లకు పైగా సంపాధించి అమెరికా ఆర్ధిక వ్యవష్టపై ప్రభావం చూపింది. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రఖ్యాత టైమ్స్ మాగజిన్ బ్రిటన్ కింగ్ ఛార్లెస్ ను సైతం పక్కకు నెట్టి టేలర్ ని ఈ ఏడాది “పర్సన్ ఆఫ్ ది ఇయర్”గా ప్రకటించింది.