ఇక మంచి రోజులే…
భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ,…