నిర్లక్ష్యం నీడలో “నైటింగెల్స్”…
ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన నర్సింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం కొనసాగిన ఈ వ్యవస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. అనేక నియమ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నర్సులు, నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ట్యూ టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు…