
రైతులకు క్రిషి 2.0 …
దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ రహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించారు. ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాల్లో క్రిమిసంహారక, పురుగు మందులను పిచికారీ చేస్తుంది. నెలలో 750 నుండి 900 ఎకరాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే అవకాశం ఉంది….