అహంకారపు "అడ్డా"..! - EAGLE NEWS

అహంకారపు “అడ్డా”..!

Thumb

ఏంటి “నాయుడు”…! గత ఎన్నికల్లో కుల పిచ్చి, ప్రాంతీయ అహంకారంతో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసినందుకు పట్టుపట్టి మరీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కించుకొని తిరుమలేశుని దాసుడిగా వేషం వేసుకున్నావు. బుర్రలో అక్షర జ్ఞానం లేకపోయినా, నువ్వెవరో తెలుగు జనానికి ఏ మాత్రం అవగాహన లేక పోయినా “నాయుడు” అనే ఒకేఒక్క “ట్యాగ్ లైన్”  (గాలం) తో వెంటబడి  చంద్రబాబుని వలలో వేసుకున్నావు. సరే, నీవు, నీ చుట్టూ ఉండే కొందరు అక్రమ రిపోర్టర్ల త్రయం చేసిన ప్రయత్నం ఫలించింది. హైదరాబాద్ శివారు బిహెచ్ ఇ ఎల్ క్వార్టర్స్ లో ఉండే నీవు 2007లో ఛానల్ పెట్టి అప్పట్లో అంకిత భావం ఉన్న కొద్దిమంది జర్నలిస్టుల పుణ్యాన నీకు తేలియకుండానే ఎదిగిపోయావు. ఆ సంగతి అందరి కంటే నీకే  బాగా తెలుసు.

br naidu team

అయితే, ఇప్పుడు మీరు చేస్తున్న నిర్వాకం అధికారం తలకెక్కినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు మీకు అప్పజెప్పిన తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ పదవి, మీ ఛానల్ లో చైర్మన్ మాదిరిగా ఎంజాయ్ చేయడానికి కాదు అనేది తెలిసి ఉండాలి. అది ఒక బాధ్యతాయుతమైన పవిత్ర పదవి అర్ధమై ఉండాలి. అలాంటి సీటులో కూర్చున్న మీకు ఆ బాధ్యతల సంగతి తెలియదనే వాస్తవం పక్కన పెడితే,  ఆ సీటుపై ఎంత మాత్రం గౌరవం లేదనేది మాత్రం స్పష్టం అవుతోంది. మీరు టిటిడికి ఏడాది కాలంగా ఏం చేశారో ఆ ఏడుకొండలవడికే తెలియాలి. కానీ, ఈ కాలంలో ఏదో పొడిచినట్టు చెప్పుకోవడానికి మీ కొఠరి పడ్డ తాపత్రయం బాగానే ఉంది. కానీ, మీలాంటి వాళ్ళు తప్పులు కప్పి పుచ్చుకొని, గొప్పలు చెప్పుకోవడానికి, వాటిని నలుగురికి చేరవేయడానికి  తిరుమలేశుడు ఒక ప్రాంతాన్ని సూచిస్తాడు. అందులో ప్రధానమైంది తిరుపతి లోని మీ ఛాంబర్. లేకుంటే వేరే ప్రాంతాల్లోని టిటిడి సన్నిధానాలు. వీటన్నింటినీ పక్కన పెట్టేసి హైదరాబాద్ లోని నీ టివి 5 కార్యాలయాన్ని పత్రికా సమావేశానికి వాడుకోవడం మదమెక్కిన చేష్టలే. ఏడాది కాలంలో మీ సొల్లు కబుర్లు చెప్పడానికి మీ మీడియా ఆఫీసు లోని ఐదో అంతస్తును ఎందుకు ఎంచుకున్నారు. అదేమైనా, టిటిడి అధికారిక అతిధి గృహమా లేక మీరు వత్తాసు పలుకుతున్న తెలుగుదే శం  పార్టీ నగర కార్యాలయ అడ్డానా. అసలు, అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న మీరు మీ ఏడాది ఘనకార్యాలు వెల్లడించడానికి హైదరాబాద్ ని ఎందుకు ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్వామి వారి నిలయం తిరుపతి లేదా, బాబుగారి కలల సౌధం అమరావతి లేదా. లేకపోతే, అక్కడి మీడియా పై నమ్మకం లేదా.. ఎందుకు తెలంగాణ లోని మీ కార్యాలయంలోనే సమావేశం పెట్టారు.  ఉదయం నుంచి రాత్రి వరక నీతులు వల్లించే యాంకర్ రూపంలో ఉన్న పెట్రోల్ బ్యాంకు ఓనర్, మరో మణికొండ మాయగాడు, ఇతర బ్లాక్ మెయిల్ ఎడిటోరియల్ టీమ్ నిద్రపోయిందా లేక కాసుల వేటలో కేసుల భయంతో మీకు సలహాలు ఇవ్వడం మరచి పోయిందా.

మిమ్మల్ని ప్రశ్నించే దినపత్రికలు, ఛానళ్ల ను తప్పించుకోవడానికే విలేకరుల సమావేశాన్ని మీ అడ్డాలో నిర్వహించినట్టు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మీరే చెప్పాలి చైర్మన్  నాయుడు గారు. దేవదేవునికి సేవ చేసే అదృష్టం అంటూ చెప్పలేక చెబుతున్న మీ ఆలోచనల వెనుక అసలు కపటం. కనీసం “బాబు” కైనా చెప్పండి. మీ గురించి ఆ శ్రీమన్నారాయణుడికి అంతా తెలుసు…! అందుకే “ఈగల్ న్యూస్” రూపంలో గరుడ ఇలాప్రశ్నిస్తోంది ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *