“తగ్గేదే లే” అంటూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హోరెత్తించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సుమారు ఏడు దశాబ్దాల జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాల్లో ఒక హీరో క్యారెక్టర్ కి జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం గ విషయం. 2021 సంవత్సరానికి గాను 24 కేటగిరీల్లో 69వ జాతీయ అవార్డులను ప్రకటించారు.
ఈ అవార్డుల్లో తెలుగు తెర మెరవడం విశేషం. రాజమౌళి రూపొందించిన “ఆర్ ఆర్ ఆర్” సైతం సత్తా చాటింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ హీరో అవార్డు లభించగా, ఉత్తమ నటిగా అలియా భట్ నిలిచారు. ఇక, “ఆర్ ఆర్ ఆర్” కి సంబంధించి ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్,ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి దక్కించుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడు (పుష్ప) దేవీశ్రీ ప్రసాద్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం),బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) అవార్డ్ పురుషోత్తమాచార్యులు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) సర్దార్ ఉద్దమ్, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ) 777 చార్లీ, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం) కడైసి వ్యవసాయి ఎంపికయ్యాయి.