హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సోలాన్ ప్రాంతంలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 50 ఏళ్లలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొన్నారు. బియాస్ నది ఉప్పొంగడంతో వరద ధాటికి ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ భారీ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. జాతీయ విపత్తు నివారణ బలగాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంత ప్రజలకు సహకరిస్తున్నాయి.