పొంచి ఉన్న వరదలు..

Screenshot 2023 07 19 161905
godavari in 1

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో నదులు వరద నీటితో పోట్టేతుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలకు సమాయత్తం అయింది. గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల భద్రాచలం వద్ద రాత్రికి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షలు, ఇంద్రావతి నది నుండి 2.15 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల వల్ల పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా, తాలిపేరు ప్రాజెక్టు నుండి 60 వేలు క్యూసెక్కుల విడుదల కావడంతో అర్ధరాత్రి 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని వివరించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. పొంగి పొర్లే వాగులు, వంకలు, జలాశయాలను వీక్షించేందుకు ప్రజలు వెళ్లకుండా బారికేడింగ్ తో నియంత్రణ చేయాలని, రాకపోకలు నిలిపి వేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారుల పైకి నీరు వచ్చిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని చెప్పారు. విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను చెప్పారు. అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950, వాట్సప్ నంబర్ 9392919743కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని సూచించారు.
24 గంటలు పని చేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని, కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. వర్షాలు వల్ల వాగులు, జలాశయాల్లో భారీగా నీరు చేరుతున్నదని అందువల్ల పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని, మేతకు బయటకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచే విధంగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. జలాశయాలు వద్ద గజ ఈత గాళ్లను, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయిస్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *