రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం “ఛలో రాజ్ భవన్ ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు సమావేలో రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ విద్యకు నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్ వర్గాలకు లాభం చేసే చర్యలలో భాగంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారని ఆరోపించారు. పరిశోధన ,ఫెలోషిప్లు లేకుండా విదేశీ యూనివర్శీటీలే ఈ దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే విధానాలు ఈ నూతన విద్యావిధానం పేరుతో అమలు చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు విభజన హామీలను అమలు చేయడం లేదని, గిరిజన యూనివర్శీటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రజనీకాంత్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.