రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టుల పట్ల ఎందుకు ద్వంధ వైఖరిని అవలంభిస్తోంది. లక్షల రూపాయలు ధార పోసి కొనుగోలు చేసి, కొందరు అసూయపరుల మూలంగా పదిహేను ఏళ్లకు పైగా కోర్టులో నలిగి సాధించుకున్న భూములను జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడానికి ప్రభుత్వం నాన్చుడు ధోరణి ఎందుకు అవలంభిస్తోందో అంతుపట్టడం లేదు. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమిని జర్నలిస్టులకు అప్పజెప్పడానికి అంగీకరించిన మంత్రి వర్గానికి పేట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వమే కేటాయించిన 38 ఎకరాల భూమిని సొసైటీకి బదలాయించాలానే ఆలోచన రాకపోవడాన్ని జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సహా జర్నలిస్టు సంఘాలు తప్పు పడుతున్నాయి. పేట్ బషీరాబాద్ లో కేటాయించిన భూమి సొసైటీకే చెందుతుందనే సుప్రీం కోర్టు సూచనలు, తీర్పును ప్రభుత్వం తొక్కిపట్టడానికి కారణం అర్ధం కావడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వచ్చి సంవత్సరం కావస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి గానీ, పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ నుంచి గానీ పేట్ బషీరాబాద్ స్థలం బదలాయింపు పై నోరు మెదపక పోవడంలో ఆంతర్యం అర్ధం కాకా సొసైటీ పాలక వర్గం, సొసైటీ సభ్యులు ఆందోళన చేడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాల్సిన రాష్ట్ర మీడియా అకాడమీ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేసిందనే విషయం కూడా బయటికి పొక్కకపొవడంతో పేట్ బషీరాబాద్ స్థలంపై పలు అనుమానాల తలెత్తుతున్నాయి. కోకాపేటలోని విలువైన స్థలాన్ని అక్కడి జర్నలిస్టులకు ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం పేట్ బషీరాబాద్ స్థలాన్ని కూడా సొసైటీకి బదలాయిస్తే బాగుండేదని పలుఫురు సీనియర్ అధికారులే అభిప్రాయ పడుతున్నారు. అయినప్పటికీ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని పదేపదే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న హామీలను తప్పక అమలు చేస్తారనే నమ్మకంతో జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తాము చేస్తున్న పోరాటం కేవలం సమస్యని ప్రభుత్వం దృష్టికి తిసుకుపోవాలనే ఉద్దేశ్యంలో భాగమే తప్ప ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి కాదని సొసైటీ చెబుతున్నారు. కోకాపేటలో భూమిని బడలాయిస్తున్నట్టే పేట్ బషీరాబాద్ స్థలాన్ని కూడా వెంటనే జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని కోరుతున్నారు.