తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వ్యుహాలకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రానికి చెందినా ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోంది. మొన్న బండి సంజయ్ అమిత్ షా ని కలవడం, ఆతర్వాత ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రకటించడం, కిషన్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ చేరికపై మంతనాలు చేయడం కనిపిస్తోంది. తాజాగా బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఢిల్లీలోని తెలంగాణ ఎలక్షన్ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.