నీటి పై అవగాహనా భేష్…

water

ఢిల్లీలో నిర్వహించిన జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్  ధనకడ్ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి బహుమతి అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు మూడవ అవార్డ్ లభించింది. గ్రామపంచాయతీ కేటగిరీలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయితీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథ పురం గ్రామానికి అవార్డ్ దక్కింది. నీటి విధానాలను అవలంభించడం ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాది కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామంకు అవార్డు వరించింది. జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని, పంచాయితీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం ఉపరాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును అందుకున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణలో ఏపీలోని చాగలమర్రి కస్తూర్బా స్కూల్‌కు రెండవ బహుమతి లభించింది. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి రెండవ అవార్డ్ దక్కింది. ఉత్తమ పరిశ్రమగా తిరుపతిలోని సీసీఎల్ ఇండియా లిమిటెడ్‌కు మూడవ బహుమతి దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *