ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా జరిపారు. అదీ సంతోషంతో కాదు. పాలకులకు నిరసన సూచకంగా..78 ఏళ్ల స్వాతంత్ర్య మురిపెం, దాని ఫలాలు తమకు అందలేదని ఆదివాసీలు అసంతృప్తిగా ఉన్నారు. వి.మాడుగుల,మండలంలో తాటిపర్తి పంచాయతీ చివారు రాజయ్ పురంలో గ్రామంలో గిరిజనులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్ధనగ్నంగా ఆకులు చుట్టుకోని నెత్తిన అడ్డ ఆకుల టోపీలు పెట్టుకోని 78 ఎళ్ళు స్వతంత్ర ఫలాలు అందలేదని నిరసన తెలిపారు. గ్రామానికి రోడ్డు, త్రాగునీరు, విద్యా, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవని, వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపా ద్యక్షురాలు కార్లిభవాని మాట్లాడారు, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర 78వ దినోత్సవమని తెలిపారు. కానీ నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేరిస్తేనే నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజనులకు స్వాతంత్రం వచ్చినట్టు అవుతుందని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 78 వసంవత్సరం అడుగు పెడుతున్నప్పటికీ గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు రోడ్లు, తాగు నీరు, కరెంటు, రేషన్ కార్డులు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సాక్ష్యం అన్నారు.