జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్

allm
wgl ktr

జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల విషయంలో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహా వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కలిసిన జర్నలిస్ట్ సంఘ నేతల తో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలపై కూడా అల్లం నారాయణతో మాట్లాడినట్టు, జే ఎన్ జే సొసైటీ తో సహా ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.ఇక వరంగల్ ,హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్,ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో వాటి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబరు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలు ఉండగా, అధికారులు గతంలోనే వాటికి భూములను కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు కాక, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సూచించారు. జాబితా ఖరారు అయితే వారికి కూడా ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *