“కూర”కు దూరం…

IMG 20240724 WA0007

సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు పోటీ పడి మరి ఆకాశాన్నంటు తున్నాయి. ముఖ్యంగా ప్రతీ వంటలో అవసరం అయ్యే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది.సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాను పక్కన పెడుతున్నారు. హైదరాబాద్ రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు.

ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తుండటంతో చాలా మంది మధ్యతరగతి వినియోగదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు. ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కిందని, కొత్త దిగుమతి వచ్చే వరకు అంటే మరో నెలన్నర పాటు ఈ ధరల భారం మోయక తప్పదని రైతులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *