జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందా తనానికి మచ్చ పడుతోంది. ఆయన ఇతరుల పట్ల ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా ఉంటారనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలగలుపుగా ఉండే ఆయన అకాల మరణం నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల వారికి ఎప్పటికీ తీరని లోటే. ఇప్పుడు అది విషయం కాదు. కానీ, ఆ మహానేత వారసులుగా, ఆయన రాజ నీతిని అనుసరించాల్సిన బిడ్డలు అదుపు తప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గత పదేళ్ళలో అటు జగన్, ఇటు షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరూ అలకిస్తూనే ఉన్నారు. కానీ, మొన్న సమయమూ, సందర్భమూ లేకుండా వై.ఎస్.షర్మిల తన కుటుంబం లోని నాలుగు గోడల మధ్య జరిగిన రాద్దాంతరాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం రాజకీయ ఏ ఒక్క విశ్లేషకునుకినికే కాదు సామాన్యునికి సైతం మింగుడు పడడం లేదు. సినీ నటులు ప్రభాస్ కి షర్మిలకు మధ్య అప్పట్లో ఏం జరిగిందో నాలుగు గోడలకే తెలుసు గానీ, ఆ విషయం పై మొన్న షర్మిల మాట్లాడిన పద్ధతి, ఆ విధానం ప్రత్యేకంగా ప్రభాస్ అభిమానులకు నచ్చడం లేదు.
ఎప్పుడో జరిగిన అంశాన్ని ఇప్పుడు దాన్నే ప్రధాన విషయంగా చూపుతూ ప్రభాస్ పై అగౌరవ పదజాలం వాడడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రచారం మేరకు షర్మిలకు ప్రభాస్ కు ఏదో రకమైన సంబంధం ఉన్నా అది కుటుంబ పరంగా నాలుగు గోడల మధ్య తేల్చుకోవాలని, అలాంటిది అన్న జగన్ పై అక్కసుతో అర్ధంతరంగా రోడ్డుకి ఎక్కి ప్రభాస్ ని “వాడు” అంటూ సంబోధించడం షర్మిల అవివేకానికి అద్దం పడుతోందని అభిమానులు గుర్రుమంటున్నారు. తనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని వాడు అంటూ ఎలా సంబోధించారని ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా నటునిగా ఉన్న ప్రభాస్ ని ఆయన అంటే ఇప్పటికీ ఎవరో తెలియదని చెప్పడం షర్మిల తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడమే అనే వ్యాఖ్యలు గుప్పుమంటున్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనేక సంఘటనలు తలెత్తుతున్న ఈ సమయంలో ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న షర్మిల అసలు ప్రభాస్ అంశాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది సమస్యలను తప్పుదోవ పట్టించే వ్యవహారంగా భావిస్తున్నారు. ఎదుటి వ్యక్తితో ఎంతో సఖ్యత ఉంటే తప్ప “వాడు,వీడు” అనే పదాలు వాడరని “ఆంధ్రాభాష”లో గుర్తు చేస్తున్నారు.
“వాడెవడో తెలియదా..మరి “అప్పుడు”
ప్రభాస్ వాడెవడో తెలియదని, ఆయనెవరో తెలియదని షర్మిల మాట్లాడిన తీరుని అటు రాజకీయ, ఇటు సినీ రంగ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి బాధ్యతాయుతమైన అధ్యక్ష హోదాలో కొనసాగుతూ కుటుంబ వ్యవహారాలతో విధులకు ఎక్కాలనుకోవడం ఏ రాజకీయం అనే వాదనలు పెల్లుబుకుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను పక్కనబెట్టి అన్న అరాచకాలు కుటుంబ తగాదాలపై ఇరుసుకు పడ్డ తీరు పార్టీ అధినాయకత్వం ఇప్పటికీ మరచిపోలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలగాన్ని, బలాన్ని పెంచే ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన షర్మిల ఆ పార్టీ ఎజెండాను తుంగలో తొక్కి కేవలం అన్న జగన్ రెడ్డి పై అక్కసు తీర్చు కోవడానికి పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. అదానీ అక్రమాలపై మాట్లాడాల్సిన షర్మిల అన్న అవినీతి, ప్రభాస్ రొమాన్స్ గురించి మాట్లాడడం నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు శరాఘాతం అంటూ సుంకర పద్మ వంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు బహిరంగంగా చెబుతున్నారు. అసలు ఆ రోజు అదానీ అంశం మాట్లాడమని కాంగ్రెస్ హై కమాండ్ చెబితే షర్మిల దాన్ని పక్కన పెట్టి ప్రభాస్ విషయాన్ని తెర పైకి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రభాస్ చిన్న తనంలో తెలియకపోవచ్చు కానీ, ఆయన సినిమా హీరో కదా.. మరి “ఇప్పుడమ్మా” అంటూ “బాహుబలి” అభిమానులు సందేహాలు వెల్లడిస్తున్నారు.