Screenshot 20240728 210106 Gallery

అన్నను వదలని చెల్లెలు..!

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని వేలెత్తి చూపుతాయి. ప్రజావ్యతిరేక విధానాల్లో లోపాలను ఎండగడతాయి. వాటి పరిష్కారానికి పోరాడతాయి. కానీ, ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ పార్టీ వైసీపీని రచ్చేకిడ్చే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్…

Read More
zero c

పార్టీ మూత  – ఫలితాలు సున్నా…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి  ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా…

Read More
hand fan c

చెల్లిని తీసేయండి – నేను చూసుకుంటా ?

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న  తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో  వైసీపీని…

Read More
katha c

ముంచిన “కుటుంబ కథా చిత్రం”..!

జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో ఈ సారి కొత్త తరహా దెబ్బ తగిలింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవడానికి, ఓడిపోవడానికి అక్కడి రాజకీయ సమీకరణలు కారణమైతే, ఆంధ్రాలో మాత్రం కేవలం కుటుంబ కలహాలు పార్టీ ఆశలను బూడిదలో పోశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దాన్ని అవకాశంగా మలచుకొని లబ్ధి పొందవచ్చనుకొని  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పావులు…

Read More
vijaya usa c

ఎవరి కోసం.. ఈ రాజకీయం..!

ఒకే రక్తం, ఒకటే గర్భం కానీ పుట్టిన బిడ్డలు మగ, అడ అదే తేడా. తల్లి “కడప” గడప దాటని గృహిణి. తండ్రిది దేశానికి ఏదో చేయాలనే తపన. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా ఆధిపత్యాన్ని చాటారు. రాజకీయంగా ఆయన ఆశయం, దూర దృష్టి అమోఘం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో చేయాలనుకున్న ఆయన అకాల మరణం ఆ కుటుంబానికే కాదు తెలుగు ప్రజలకు, ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తీరని లోటు. వైఎస్ఆర్…

Read More
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read More
jagan rk

“ఆళ్ల”మళ్ళీ…

జగన్ పై కొండంత కోపం, వైకాపా పై చిర్రుబుర్రులు ఆడుతూ షర్మిలా సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి తిరిగి గోడకు తగిలిన బంతిలా వైసీపీ గొడుగు కిందకు చేరారు. అనేక రకాల నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన తాజాగా జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, టిక్కెట్టు ముఖ్యం కాదని, మంగళగిరి స్థానం ముఖ్యమని అక్కడ వైసీపీ ఎవర్ని…

Read More
fmly c

వీధికెక్కిన”రాజ”కుటుంబం..!

“రాయలసీమ”…ఈ గడ్డ ఆది నుంచి కక్షలు, కార్పణ్యాలకు నిలువెత్తు నిదర్శం అని చరిత్ర చెబుతున్న పాఠం. అక్కడ రాజ్యం ఏలిన ఆనాటి రాజుల నుంచి నేడు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలలో ఆ నైజం స్పష్టంగా కనిపిస్తునే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో గొడ్డలి వేట్లు, నాటు బాంబులు, రాగి సంకటి అనగానే గుర్తొచ్చేది “సీమ” ప్రాంతాలే. ప్రత్యర్థులను వెతకడం, వేటాడడం,  ఎంత వాస్తవమో, కుటుంబ గౌరవానికి పెద్ద పీట వేయడం అంతే వాస్తవం. కానీ…

Read More
four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read More
sai sharmila

పెళ్ళికి ఆహ్వానం…

తన కుమారుని వివాహానికి హాజరు కావలసిందిగా వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని ఆహ్వానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read More
jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More
pawnshrml c

“మాట”మారింది…”మడమ”తిరిగింది!

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైఎస్అర్ తెలంగాణ పార్టీల నిర్ణయాలు రాజకీయ పరిశీలకులను, సాధారణ ప్రజానీకాన్ని సందిగ్దంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమెంతో స్పష్టంగా తెలియని ఆ రెండు పార్టీ లు రోజుకో దారిని వెతకడం ఓట్ల చిలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యూహంలో జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, తెలంగాణా ప్రాంతంలో వైఎస్అర్ తెలంగాణా పార్టీ  వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు దేన్నీ ఆశించి రాజకీయాలు…

Read More
sharmila c1

“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో…

Read More