గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల లెక్కలతో గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుతానికి అడవి బిడ్డల గోడు పట్టకలోవడం విచారకరం.
విశాఖ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటనే పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుని ప్రశ్నిస్తోంది. వైట్ కాలర్ దొంగలను వెతకడానికి పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లి మంత్రులు, అధికారులుకు అడవుల్లో ఏ సౌకర్యము లేకుండా బతుకూలీడుస్తున్న గిరిజనుల వెతలు కనిపించక పోవడం విమర్శలకు దారితీస్తోంది.
విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీని గ్రామస్తులు నానా తిప్పలు పడి ఉరుదాటించారు. సరైన రోడ్డు లేక, వాగు దాటే మార్గం లేక డోలి కట్టి ఆమెను వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లేకపోవడం ఒక సమస్య అయితే, గ్రామాలలో శిబిరాలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గ్రామానికి రోడ్డు వేయడంలో పంచాయితీ రాజ్ శాఖ చూపుతున్న నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.