IMG 20250427 WA0025

“గులాబీ” గరళం…

భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం….

Read More
hcu c cf

నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!

అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక  తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి…

Read More
IMG 20250312 WA0044

19న తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ…

Read More
cong brs c

బలమైన ప్రభుత్వం – తెలివైన విపక్షం

తెలంగాణ ప్రజలకు ఉద్యమ ముసుగు వేసి పదేళ్ల పాటు అరాచక పాలన సాగించారు. మడకశిర కుటుంబం దుబాయ్ లోని “బుర్జ్ ఖలీఫా” శిఖరానికి ఎదిగింది. నీటి పేరు చెప్పి, కార్ల రేసులు చూపి, మద్యం మత్తు ఎక్కించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అవినీతి,అక్రమాలకు పోలీసులనే దొంగల ముఠాగా మార్చారు… ఇవీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (భారాస) పై బహిరంగంగా వెల్లువెత్తిన ఆరోపణలు, పదేళ్ళూ తెర…

Read More
shrprabh C

“వాడెవడు”…”ఆయన” ఎవరు..!

జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందా తనానికి మచ్చ పడుతోంది. ఆయన ఇతరుల పట్ల ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా ఉంటారనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలగలుపుగా ఉండే ఆయన అకాల మరణం నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల వారికి ఎప్పటికీ తీరని లోటే. ఇప్పుడు అది విషయం కాదు. కానీ, ఆ మహానేత వారసులుగా, ఆయన రాజ నీతిని అనుసరించాల్సిన బిడ్డలు అదుపు తప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది….

Read More
IMG 20240818 WA0005

ఇక జాతీయ స్థాయి పోరు

జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై హింద్ నేషనల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా హైదరాబాద్ లోని హైటెక్స్ లో సమావేశమై దేశ సమకాలీన సమస్యలు, పేదరికం, అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం జై స్వరాజ్ పార్టీ అధినేత…

Read More
reddy dora c

“రెడ్డి”ని ఓర్వలేని “దొరలు”..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమేనా? అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టిమరీ భారాస నేతలు రేవంత్ నే టార్గెట్ చేసుకున్నారా? భారాస శ్రేణులను ప్రేరేపించడానికి, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టడానికి కెటీఆర్, హరీష్ వంటి వారు వ్యూహ రచన చేస్తున్నారా? ఉద్యమ సమయంలో మాదిరిగా మోకా చూసుకొని అగ్గి రాజేయాలని పన్నాగం పన్నుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు భారాస నేతల పోకడ చూస్తే  అవుననే సమాధానం…

Read More
IMG 20240726 WA0025

రచ్చ చేస్తే “రద్దు” చేస్తాం..

శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేక పోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చో నివ్వలేదు. ప్రస్తుతం నా దగ్గరకు 10 మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు….

Read More
images 17

పార్టీలు పెంచిన “ప్రశాంత్”.!

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని…

Read More
Screenshot 20240728 210106 Gallery

అన్నను వదలని చెల్లెలు..!

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని వేలెత్తి చూపుతాయి. ప్రజావ్యతిరేక విధానాల్లో లోపాలను ఎండగడతాయి. వాటి పరిష్కారానికి పోరాడతాయి. కానీ, ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ పార్టీ వైసీపీని రచ్చేకిడ్చే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్…

Read More
smita c

నెట్టింటి “స్మిత”..!

స్మితా సబర్వాల్… ఈ పేరు, ఆమె చిత్రాలు తెలియని సామాజిక “మాధ్యమకారులు” ఉండరు. ఆమె పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక వైరల్.. మరో ఆకర్షణ. తెలంగాణ రాష్ట్రం వేదికగా గత ఏడెనిమిది ఏళ్లుగా సోషల్ మీడియాలో ఆమెకు అనేక లైక్ లు, ఫాలోయింగ్ లు…అసలు ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారా లేక “నెట్టింట్టి” దత్త పుత్రికా అన్న రీతిలో ఎక్స్, ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అకౌంట్లు కనిపిస్తాయి. భారత పరిపాలనా అంశాల్లో శిక్షణ పొందిన…

Read More
IMG 20240513 WA0030

“దొర” అడుగు పెట్టరా..?

రాష్ట్ర శాసనసభ సమావేశాలు అంటే ప్రజలకు అనేక ఆశలు ఉంటాయి. అందులో బడ్జెట్ సమావేశాలంటే మహా ప్రత్యేకం. ఈ బడ్జెట్ లో తమకు ఆమోదయోగ్యం కాని కేటాయింపులు, పథకాల పై ప్రశ్నించే గొంతుక కోసం వేచి చూస్తారు. అదే అధికార, ప్రతిపక్షాల మేళవింపు శాసనసభ. బలమైన అధికార పక్షం సభ ముందు ఉంచే అంశాలను అధ్యయనం చేసి తప్పు, ఒప్పులను ఎత్తిచూపాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్షానిది. కానీ తెలంగాణలో జరుగుతున్న తంతు విచిత్రంగా ఉంది. పదేళ్ల పాటు…

Read More
zero c

పార్టీ మూత  – ఫలితాలు సున్నా…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి  ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా…

Read More
eye c

పొంచివున్న “రెండు కళ్లు”…!

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది. ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో…

Read More
erravlli ala c

చేరికలా… చొరబాటులా…?

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి…

Read More